టీసాట్ నెట్‌వర్క్ చానళ్లకు జాతీయ అవార్డు

తెలంగాణ ఐటీ, సమాచారశాఖ పరిధిలో నడుస్తున్న టీసాట్ నెట్‌వర్క్ టీవీ చానళ్లకు అరుదైన గౌరవం దక్కింది. గవర్నెన్స్ నౌ సంస్థ ఆధ్వర్యంలో అందించే డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుకు టీసాట్ ఎంపికైంది. టీసాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి నవంబర్ 6న ఢిల్లీలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. టీసాట్ నెట్‌వర్క్ చానళ్లు గత మూడేండ్లుగా మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా సేవలందిస్తూ ఎంతో ఆదరణ పొందాయి.

కేవలం శాటిలైట్ మీడియా ద్వారానే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిన ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సేవలందిస్తూ ప్రశంసలు పొందాయి. గతంలో కేవలం కొన్ని ప్రాంతాలు, కుటుంబాలకే పరిమితమైన టీసాట్ నెట్‌వర్క్ చానళ్ల సేవలు.. శైలేశ్‌రెడ్డి సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 80 శాతం కుటుంబాలకు అందుబాటులోకి వచ్చాయి. గవర్నెన్స్ నౌ సంస్థ 2015 నుంచి ప్రభుత్వరంగ సంస్థలపై అధ్యయనంచేస్తూ వాటి పనితీరు ఆధారంగా ఏటేటా అవార్డులను అందజేస్తున్నది.

Share This Post
0 0

Leave a Reply