టీమిండియాకే అవకాశాలెక్కువ : సచిన్‌

క్రికెట్‌ విశ్లేషకులంతా ఈ సారి ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల పేర్లను చెప్తుంటే భారత లెంజడరీ బ్యాట్స్‌మన్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ మాత్రం మరోలా స్పందించాడు. ఈ సారి ప్రపంచకప్‌ భారత్‌కే రాబోతోందని జోస్యం చెప్పాడు. ముంబయిలోని ఎంఐజీ మైదానంలో సచిన్‌ పేరుతో పెవిలియన్‌ ఎండ్‌ను ప్రారంభించిన సందర్భంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ మాట్లాడాడు. ‘మే 30 నుంచి జరిగే ఈ ప్రపంచకప్‌ పూర్తి వేసవిలో జరగనుంది. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లాండ్‌ వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు.’

Share This Post
0 0

Leave a Reply