టీచర్ స్టూడెంట్కి శృంగార పాఠాలు..

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్ ప్రేమ పాఠాలు వల్లె వేశాడు. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను లొంగదీసుకుని ఆమె గర్భం దాల్చేలా చేశాడు.మాయ మాటలతో ఆమెను తన వెంట తీసుకెళ్లి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.చదుకోవాల్సిన వయసులో విద్యార్థిని జీవితంతో ఆడుకున్న అతగాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఆదిమూర్తిపల్లెకు చెందిన ఓ మైనర్ బాలిక పదో తరగతి తర్వాత ఇంటర్ కోసం తిరుపతిలోని ఓ కాలేజీలో చేరింది.అయితే గత ఏడాది దసరా సెలవుల నిమిత్తం ఆమె ఇంటికి రాగా.. అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే ప్రైవేట్ టీచర్ ఆమెతో మాటలు కలిపాడు. పాత పరిచయం ఉండటంతో దాన్ని అడ్డుపెట్టుకుని ఫోన్‌లో తరుచూ మాట్లాడేవాడు. అలా ప్రేమ పేరుతో ఆమెను మభ్యపెట్టాడు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి ఊరి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే బాలిక కోసం కొన్నాళ్లు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో కొన్నాళ్లకి ఆ కేసు మరుగునపడిపోయింది.బాలిక తల్లిదండ్రులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా వారి వైపు నుంచి నిర్లక్ష్య సమాధానమే వచ్చింది. అయితే ఇటీవల బాలిక తల్లి కొత్తగా వచ్చిన ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ మళ్లీ ముందుకు కదిలింది.పోలీసుల దర్యాప్తులో బాలిక సికింద్రాబాద్‌లోని ఓ ప్రాంతంలో టీచర్ వీరయ్యతో ఉంటున్నట్టు తెలిసింది. ఆమె గర్భం దాల్చినట్టు కూడా తెలిసింది. దీంతో ఇటీవలే పోలీసులు వారిద్దరిని సికింద్రాబాద్ నుంచి ఆదిమూర్తిపల్లెకి తీసుకొచ్చారు. బాలికను చూసిన తల్లిదండ్రులు షాక్ తిన్నారు. చదువుకోవాల్సిన తమ బిడ్డ ఇంత చిన్న వయసులో గర్భం దాల్చడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు వీరయ్యపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Share This Post
0 0

Leave a Reply