‘జై బాలయ్య’ అంటూ రాజమౌళి కుమారుడి పెళ్లిలో ఎన్టీఆర్

jr ntr

దర్శక దిగ్గజం రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం పూజతో జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. శనివారం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగ్గా, నిన్న రాత్రి వివాహం జరిగింది. ఈ కార్యక్రమాల సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పక్కనున్న వారు కూడా ‘జై జై బాలయ్య’ అంటూ తమ గొంతు కలిపారు.

Share This Post
0 0

Leave a Reply