జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ మెట్రో పరుగులు

గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైల్‌ను జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్‌ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్‌ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్‌లో మెట్రో రైల్‌ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్‌ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్‌ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్‌అండ్‌టీ, హెచ్‌ ఎంఆర్‌ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్‌కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు.

Share This Post
0 0

Leave a Reply