జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు పది పరీక్షలు

కరోనా కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదోతరగతి పరీక్షలను ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు నిర్వహించనున్నది. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పరీక్షల టైంటేబుల్‌ను మంత్రి విడుదల చేశారు. ఒక్కో పరీక్ష మధ్య రెండురోజులు సమయం ఉంటుందని, ఆదివారం కూడా పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మార్చిలో జరుగుతున్న టెన్త్‌ పరీక్షలను కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో అర్ధంతరంగా వాయిదా వేశామని.. మిగిలిపోయిన సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాలంటూ తాజాగా సూచించడంతో షెడ్యూల్‌ జారీచేశామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా బెంచ్‌కి ఒక్కరినే కూర్చోబెట్టే ఏర్పాట్లుచేశామని, ఇందుకోసం ఇప్పటికి ఉన్న 2,530 పరీక్ష కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 26,422 మంది అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.

Share This Post
0 0

Leave a Reply