జనసేనలో సరికొత్త సందడి.. ఇక అసెంబ్లీ వైపు దృష్టి

జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. రాబోయే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. సామాజిక వర్గాల సమతూకంతో ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ కమిటీలను కూర్చింది. పార్టీలో ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేయకుండా జాగ్రత్త పడింది. నరసాపురం పార్లమెంటరీ కమిటీలో మహిళలకు పెద్ద సంఖ్యలో అవకాశం ఇవ్వగా, అదే ఏలూరు పార్లమెంటరీ కమిటీలో కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. సీనియర్లు కొందరికి కమిటీలో చుక్కెదురైంది. భీమవరంలో విద్యా సంస్థల అధిపతి విష్ణురాజును పార్టీలో చేర్చుకుని అటు వైసీపీకి, ఇటు టీడీపీకి షాక్‌ ఇచ్చింది.

మూడో కంటికి తెలియకుండా విష్ణురాజు జనసేనలో చేరారు. ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితులపై టీడీపీ సైతం ఆరా తీస్తోంది. ఆర్ధికంగా, సామాజికంగా పట్టున్న విష్ణురాజు జనసేనలో చేరికతో రసవత్తర చర్చ నడుస్తోంది. వరుసగా రాజకీయ, ఆర్థిక సామర్థ్యం కలిగిన నేతలు మరికొందరు పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదని జనసేన నేతలు ధీమాగా ఉన్నారు. సీనియర్‌ నేత చేగొండి హరి రామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాశ్‌కు నరసాపురం పార్లమెంటరీ కమిటీలో చోటు కల్పించారు. జనసేనలో చేరతారంటూ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ పేర్లు తొలుత అందరి నోటా నానాయి. ప్రస్తుతం వీరిద్దరూ కాంగ్రెస్‌లోనే కీలకంగా వ్యవహరిస్తున్నారు.తీసుకుంటున్నవారు కూడా అనర్హులే.

Tags: Janasena, Pawankalyan, Assemble, election 2019

Share This Post
0 0

Leave a Reply