‘జనసేన’కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు

జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా రావెల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీలోకి రాకముందు రావెల టీడీపీలో ఉన్నారు.

Share This Post
0 0

Leave a Reply