జగన్‌ను సీఎం పీఠం మీద కూర్చోబెడుతున్న ‘సెల్ఫీ’

ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. పార్టీ ఘన విజయానికి జగన్ పాదయాత్ర, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ప్రధాన కారణమయ్యాయి. పాదయాత్ర సమయంలో నిత్యం జగన్ వెంటే ఉన్న ఐప్యాక్ టీం ఎప్పటికప్పడు సూచనలు సలహాలు చేసింది. జనంలో జగన్‌ పట్ల ఉన్న ఆదరణను పూర్తి స్థాయిలో ఓట్లుగా మలవడానికి వ్యూహాలు రచించింది. అందులో ప్రధానమైంది.. సెల్ఫీ విత్ జగన్ స్ట్రాటజీ.

పాదయాత్ర సమయంలో జగన్ అందర్నీ ప్రేమగా పలకరించడం, వారితో ఆత్మీయంగా మాట్లాడటంతోపాటు.. అడిగిన వారందరికీ జగన్ సెల్ఫీలు ఇవ్వడం మనమంతా చూసిందే. ఓ నాయకుడు తనను కలిసి మాట్లాడితే.. ఎవరికైనా ఆ నాయకుడి పట్ల సానుకూల దృక్పథం అలవడుతుంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సెల్ఫీ స్ట్రాటజీ ఉపయోగపడింది.

పాదయాత్ర సమయంలో ఎంతో ఓపికతో వ్యవహరించిన జగన్.. అడిగిన ప్రతి ఒక్కరితో కాదనకుండా సెల్ఫీలు దిగారు. రోజుకు వెయ్యికి పైగా సెల్ఫీలు దిగారు. ఆయనతో కలిసి సెల్ఫీ, ఫోటోలు దిగిన వారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి మరింత మందికి చేరాయి. దీని వల్ల జగన్ పట్ల జనాల్లో పాజిటివ్ టాక్ పెరిగింది.

Tags: Selfie, YSJAGAN, CMPOST

Share This Post
0 0

Leave a Reply