జంతువులే సిగ్గుపడతాయి..ప్రియాంక ఘటనపై అనుష్క

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి ఘటనపై టాలీవుడ్ హీరోయిన్ అనుష్క తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. ప్రియాంకపై జరిగిన దాడి అత్యంత విషాదకరమైన ఘటన అని, ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉందంది. ఇలాంటి దారుణానికి పాల్పడిన నేరస్థులను జంతువులతో పోల్చినా..జంతువులే సిగ్గుపడతాయని అంది. ఈ సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా..? ఏ పాపం తెలియని ప్రియాంకను చంపిన నిందితులకు తక్షణమే కఠినశిక్ష పడేలా మనమంతా పోరాటం చేయాలని ప్రజలకు అనుష్క సూచించింది. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..ఆమె కుటుంబసభ్యుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. శంషాబాద్‌లో హత్యకు గురైన ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Share This Post
0 0

Leave a Reply