చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన ఆలయం…!

lord shiva

మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి అయితే మన భారతదేశంలో ఒకటే కాదు ఆశ్చర్యపడే విషయాలు ఎన్నో వున్నాయి అనేది సత్యం. అందులోనూ జీవితంలో ఎప్పుడూ నమ్మలేనటువంటి సంఘటనలు కూడా వుంటాయి. అటువంటి సంఘటనలలో లఖ్ మండల్ కూడా ఒకటి.

మాకు, మీకు సాధారణంగా తెలీని విషయం ఏమంటే ఆ భగవంతుడు మనుష్యుల ప్రాణాలను ఎప్పుడు ?ఏ విధంగా?తీసుకుంటాడో అతనికి మాత్రమే తెలుసు. అయితే పోయినా ప్రాణం మాత్రం మరలా తిరిగి రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.అయితే ఈ ఒక్క స్థలంలో మాత్రం పోయిన ప్రాణం కొన్ని నిముషాలపాటు బ్రతికించే శక్తిని కలిగివుందంట.

మరి .. ఇది నిజమో, అబద్ధమో అని మీకు అనిపిస్తూవుంటుంది. అయితే ఈ దేవాలయం ఎక్కడ వుంది? ఆ పుణ్య స్థలం ఏది? ఆ స్థలం యొక్క మహత్యం ఏమిటి?

ఈ మహిమాన్వితమైన స్థలం చనిపోయిన వారిని కొన్ని నిమిషాలపాటు బ్రతికించే ఆ మహిమాన్వితమైన స్థలం ఏది అని ఆలోచిస్తున్నారా?అట్లయితే వినండి ఆ పుణ్యస్థలమే పరమశివుడు వెలసియున్న శక్తివంతమైన ఆ దేవాలయం..పేరు లఖ్ మండల మందిర్.

ఈ లఖ్ మండల్ ఒక పురాతనమైన హిందూ దేవాలయం. మహాశివునికి అర్పితమైన పవిత్రమైన స్థలం. ఈ ఆలయం ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధిచెందింది. ఈ దేవాలయాన్ని సందర్శించివారు తమ దురదృష్టాన్ని దూరం చేసుకుంటారనికూడా చెప్పవచ్చును.

ఆనాడు .. పాండవులు అజ్ఞాతవాసంలో వున్నప్పుడు కొన్ని రోజులపాటు ఈ స్థలంలో కాలంగడిపారని చెప్పవచ్చును. అలాగే ….. పాండవులు కాలిడిన పవిత్రమైన స్థలం ఇది అని చెప్పవచ్చును

అయితే … లఖ్ మండల్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. లఖ్ అంటే “అనేకం” మరియు మండల్ అంటే “దేవాలయం” లేదా “లింగం” అనే అర్థాన్ని కలిగివుంది.ఇక….ఇక్కడ భారతదేశం యొక్క పురాతత్త్వశాస్త్ర సమీక్షకు సంబంధించిన కళాత్మకమైన కృతులు ఇక్కడ చూడవచ్చును

కానీ … ఈ దేవాలయం ముఖ్యమైన ఆకర్షణ ఏమంటే అది గ్రానైట్ తో చేయబడిన లింగం. చుట్టుపక్కల ఆ లింగం యొక్క ప్రకాశానికి ఎంతో అందంగా కనపడుతుంది. ఆ లింగాన్ని చూసిన భక్తులు ఎంతో భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు.

ఇక్కడి స్థలపురాణం ప్రకారం, మహాభారతంలో దుర్యోధనుడు ఒక లక్కగృహంలో భాస్కరుడుని జీవంతోనే కాల్చేయాలని ఒక ఇంటిని నిర్మాణం చేస్తాడు.ఆ గృహమే ప్రస్తుతదేవాలయం వుండే ప్రదేశం మరియు చుట్టుపక్కల ప్రదేశం అని నమ్మటం జరిగింది.

అలానే .. దనావ మరియు మానవ అనే కవల ప్రతిమలు ముఖ్యంగా దేవాలయం పక్కన వున్నవి.ఈ ప్రతిమలను కొందరు పాండవ సహోదరులైన భీముడు మరియు అర్జునుడు అని నమ్ముతారు.

ఇక ఇక్కడ… దనావ మరియు మానవ ప్రతిమలు విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ మరియు విజయులని చెప్తారు.అందుకే…ఎవరైనా చనిపోయిన సమయంలో లేక చనిపోతున్నప్పుడు, ఈ విగ్రహాలను వారి ముందు తీసుకువెళతారు.

అంతేనా… జీవంతో ఆ తరువాత మహాశివుని పవిత్రమైన అభిషేక జలాన్ని చనిపోయిన మానవునికి లేదా చనిపోతున్న మనిషికి త్రాగిస్తే కొన్ని నిమిషాలకాలం పాటు బ్రతుకుతారంట. ఇది ఆ పరమ శివుని శక్తినికలిగిన పవిత్రమైన అని నమ్ముతారు.

అందుకే ఆ పవిత్రమైన జలం మానవులకి జీవం వచ్చేటట్లుచేస్తుంది అంటే ఎవరికి ఆశ్చర్యం కలగదు తప్పదు చెప్పండి. ఈ స్థలానికి దగ్గరలోనే ఒక ధుంధి ఓడారి అని పిలవబడే గుహ వుంది. దీని స్థలపురాణం ప్రకారం దుర్యోధనుని నుండి కాపాడుకోవటానికి పాండవులు ఈ స్థలంలో నివాసమున్నారు అని నమ్ముతారు.

ఇంతకు ఈ దేవాలయం ఎక్కడ వుంది అని ఆలోచిస్తున్నారా?అలాగయితే వినండి ఈ మహిమాన్విత దేవాలయం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో జాన్సర్ బవర్ ప్రదేశంలో వుంది.అయితే..ఈ దేవాలయాన్ని ఉత్తరాఖాండ్ శైలిలో నిర్మించటం జరిగింది.

Share This Post
0 0

Leave a Reply