ఘనంగా సినీ నటి అర్చన వివాహం

తెలుగులో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న నటి అర్చన వైవాహిక జీవితంలో ప్రవేశించింది. ఆమె వివాహం జగదీశ్ భక్తవత్సలంతో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. జగదీశ్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అర్చన మరి కొన్ని సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ కూడా చేసింది. బిగ్ బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్లలో అర్చన కూడా ఉంది. అర్చన శాస్త్రీయ నర్తకిగా దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. కాగా, అక్టోబరు 3న అర్చన, జగదీశ్ లకు నిశ్చితార్థం జరిగింది.

Share This Post
0 0

Leave a Reply