ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, కే నారాయణరెడ్డి, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ రాకేశ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

60 ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ నెరవేరినరోజు, స్వపరిపాలనలో బంగారు తెలంగాణ పునాది పడినరోజు జూన్ 2 అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post
0 0

Leave a Reply