గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్

Goreti-venkanna

ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ భాషలకు చెందిన సాహితీవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాదికి గోరటి వెంకన్నను అవార్డుకు ఎంపికచేసింది. వాగ్గేయకారుడుగా తెలంగాణలో విశేష ప్రజాదరణ పొందిన గోరటి వెంకన్నకు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే పాట ద్వారా మరింత గుర్తింపు దక్కింది. తెలంగాణ జానపదాన్ని తన పాటల ద్వారా ఆయన విశ్వవ్యాప్తంచేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారానికి చెందిన గోరటి వెంకన్న.. ఎక్కువ భాగం రైతుల జీవితాలను, తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని వివరించే పాటలను రాసి, స్వయంగా పాడారు. రచయితగా, గాయకుడిగా పలు పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 2006లో ఉమ్మడి ఏపీలో కళారత్న పురస్కారం, 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీరాముల య్య, కుబుసం, వేగుచుక్కలు, మహాయజ్ఞం, మైసమ్మ ఐపీఎస్, బతుకమ్మ, నగరం నిద్రపోతున్న వేళ వంటి పలు తెలుగు సినిమాలకు ఆయన రాసిన పాటలు పల్లె సంస్కృతి, జీవనస్థితులకు అద్దంపట్టాయి.

Share This Post
0 0

Leave a Reply