గవర్నర్ దత్తాత్రేయ అలాయ్.. బలాయ్.. హాజరైన అన్ని పార్టీల నేతలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం (అక్టోబర్ 10) నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పలువురు నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో దత్తాత్రేయ 15 ఏళ్లుగా అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు శాంతి, సామరస్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కేశవరావు పాల్గొన్నారు. పరస్పరం అభినందనలు చెప్పుకొన్నారు.

Share This Post
0 0

Leave a Reply