గడ్డం లేని ముల్లా కేసీఆర్.. ఒవైసీ గడ్డం కోసి అతికిస్తా: బీజేపీ ఎంపీ అరవింద్

ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గడ్డంలేని ఒక ముల్లా అని… అసదుద్దీన్ ఒవైసీ గడ్డం కోసం కేసీఆర్ కు అతికిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్, ఎంఐఎంలకు లేదని చెప్పారు. కేవలం ముస్లింలకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. హిందువులు ఓట్లు వేయకుండానే టీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందా? అని నిలదీశారు.

Share This Post
0 0

Leave a Reply