క్వీన్‌గా అద‌ర‌గొట్టిన ర‌మ్య‌కృష్ణ‌- ట్రైల‌ర్

పురుచ్చ‌త‌లైవి జ‌య‌లలిత జీవితం ఆధారంగా క్వీన్ అనే వెబ్ సిరీస్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, ప్రసాద్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో జ‌య‌ల‌లిత బాల్యాన్ని చూపించారు. తాజాగా విడుద‌లైన ట్రైలర్‌లో జ‌య‌ల‌లిత బాల్యం, సినీ, రాజ‌కీయ విష‌యాల‌ని చాలా అందంగా చూపించారు. శ‌క్తి శేషాద్రి అనే పేరుతో ర‌మ్య‌కృష్ణ‌ని చూపించారు. జ‌య‌ల‌లిత చిన్ననాటి పాత్ర‌లో విశ్వాసం ఫేం అనిఖ క‌నిపించింది. డిసెంబ‌ర్ 14 నుండి వెబ్ సిరీస్‌కి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ఎంఎక్స్ ప్లేయ‌ర్‌లో వీక్షించవ‌చ్చ‌ని తెలిపారు మేకర్స్.

Share This Post
0 0

Leave a Reply