కొబ్బరినీళ్లే కానీ.. లాభాలెన్నో!

ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఎండలు తీవ్రమవుతున్నాయి. భానుడి భగభగతో అమాంతం పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు, చల్లటి మజ్జిగ, నిమ్మరసం, శీతల పానీయాలు తీసుకుంటుంటారు. దీనికోసం పట్టణ కూడళ్లు, జన సందోహాల ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. డాక్టర్లు సైతం వేసవి తాపానికి కొబ్బరి బోండాలు శ్రేయస్కరమని సూచిస్తుండటంతో కొబ్బరి బోండాలకు గిరాకీ జోరందుకున్నది. సాధారణ బోండాలతో పాటు బెంగళూరు, మైసూరు బోండాల్లో నీరు ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

* కొబ్బరినీళ్లు ఎలక్ట్రోలైట్ పొటాషియం ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఇది శరీర ద్రవాల్లో ఎలక్ట్రోలైట్‌ని తిరిగి భర్తీచేస్తున్నది. కొబ్బరి నీళ్లు తేమకోసం సిరల నుంచి పంపే ద్రవంలా ఉపయోగపడుతున్నది. ఇవి ప్రపంచంలో వైద్య సదుపాయం అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు పునరుజ్జీవనం అందిస్తున్నది.

*కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు, కొవ్వు తక్కువ ఉన్న వ్యక్తి అవి పూర్తిగా ఉన్నట్లు భావించడానికి సహాయ పడుతున్నది. ఇది ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తున్నది. మధుమేహం ఉన్న వారికి మంచిది. చక్కెర స్థాయిలను నియంత్రించి మంచి అవసరమైన పోషకాలను అందిస్తున్నది.

* ఒక వ్యక్తి శరీరం ప్లూ లేదా కలిపి రెండు రకాల వైరస్‌ల బారిన పడినప్పుడు కొబ్బరి నీళ్లు వైరల్ బాక్ట్టీరియాలను అరికట్టడానికి బాగా ఉపయోపడుతాయి.

* కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నది. ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతున్నది.

* కొబ్బరి నీళ్లలోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్ర పిండాలలోని కారాళ్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. మొటిమలు, మచ్చలు, ముడుతలు, సాగిన గుర్తులు, సిల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్లతో రెండు వారాలపాటు రాసి వదిలేస్తే, అది చర్మాన్ని శుభ్రపరుస్తున్నది.

* కొబ్బరినీళ్లు వృద్ధ్దాప్య నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటో కినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. కొబ్బరి నీళ్లలో సెటేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌పై పోరాటం చేస్తాయని రుజువైంది.

Share This Post
0 0

Leave a Reply