కేసీఆర్‌ కిట్లు 5,89,818

భవిష్యత్‌తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడం, సర్కారు దవాఖానలో ప్రసవాల సంఖ్యను పెంచడం, మాతా శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్ల పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం మొదలయ్యాక సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతంలో ప్రసవాలు 25 శాతం ఉండగా.. కేసీఆర్‌ కిట్ల పథకం అమలుతో 62 శాతానికి పెరిగింది. 2017 జూన్‌ మూడున కేసీఆర్‌ కిట్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్‌ చివరినాటికి 5,89,818 మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.620.41 కోట్లు వెచ్చించింది. అమ్మఒడి పథకం కింద గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, కేసీఆర్‌ కిట్ల కోసం ఈ మొత్తం ఖర్చుచేసింది. దేశంలో మరెక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌.. బాలింతల కోసం 16 వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్ల పథకం అమలుచేస్తున్నారు. ఈ పథకం అమలుతీరును దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు సైతం పరిశీలించి ప్రశంసలు కురిపించారు.

Share This Post
0 0

Leave a Reply