కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మెపై ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె తీవ్రతరం కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశం మేనిఫెస్టోలో లేదని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన శక్తులను నిర్మూలించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడిందని, సంస్థకు చెందిన రూ.60 వేల కోట్ల స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. నేటి ఉదయం 8:30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఇందిరాపార్కు వద్ద 16 మందితో నిరాహారదీక్షకు దిగుతామని ప్రకటించారు.

Share This Post
0 0

Leave a Reply