కేసీఆర్‌కు రక్త దాహం తీరడం లేదు

సీఎం కేసీఆర్‌కు రక్త దాహం తీరడం లేదని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. కార్మికుల ఉసురు తీసుకుని రూ.కోట్లు కూడబెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులపై సీఎం కన్ను పడిందని, వాటిని దోచుకోవడానికే అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా హన్మకొండలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అమర వీరుల స్థూపం వద్ద కార్మికుల దీక్షా శిబిరంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో సన్నాసుల రాజ్యం, మూర్ఖుల పాలన కొనసాగుతోందన్నారు.

50 వేల మంది జీవితాలతో ఆడుకుంటున్నాడని,న్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాష్ట్ర ప్రజల సమస్యగా బీజేపీ భావిస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు మడమ తిప్పని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌ తెలంగాణ ద్రోహి అని లక్ష్మణ్‌ విమర్శించారు. సొంత జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే కనీసం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించరా? అని నిలదీశారు. గులాబీ జెండాకు ఓనర్లమని ప్రకటించుకున్న నేతల నోర్లు ఎందుకు మూత పడ్డాయని ప్రశ్నించారు. ప్రజల పక్షం వహించాల్సిన హరీశ్‌, ఈటల, కేటీఆర్‌ ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని నిలదీశారు. తండ్రి మూర్ఖంగా వ్యవహరిస్తుంటే ‘మీ నోరు ఎందుకు పడిపోయిందని’ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. సామాజిక బాధ్యతగా భావించి.. గవర్నర్‌ తమిళిసై క్యాబ్‌ డ్రైవర్లతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారన్నారు.

Share This Post
0 0

Leave a Reply