కేసీఆర్‌కు జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదే: తులసిరెడ్డి

ఏపీ అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదేనని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసుపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. ముందు మన రాష్ట్రంలో చేసిన తర్వాత పక్క రాష్ట్రం గురించి చెప్పాలని సూచించారు. పొద్దుపోక, నిద్రరాక అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నట్టుగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

Share This Post
0 0

Leave a Reply