కేటీఆర్ తో భేటీ అయిన కపిల్ దేవ్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయానికి వచ్చిన కపిల్… కేటీఆర్ తో సమావేశమయ్యారు. డిసెంబర్ లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహణకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ను కపిల్ కోరారు. కపిల్ విన్నపంపై కేటీఆర్ స్పందిస్తూ, ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందని అన్నారు. దీంతోపాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు హాజరయ్యారు.

Share This Post
0 0

Leave a Reply