‘కేజీఎఫ్’ దర్శకుడితో మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ

విద్యా సంస్థలు పునఃప్రారంభం కానుండడంతో సోమవారం నుంచి వంద శాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్దేశించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. శనివారం జరిగిన బంద్‌ ప్రభావం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం నుంచి అన్ని డిపోల ద్వారా వంద శాతం బస్సులు నడపాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సిబ్బందిని నియమించుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సహకరించిన విద్యా సంస్థలకు సంబంధించిన వాహనాలు కూడా సోమవారం నుంచి ప్రభుత్వానికి అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలోనే, ఆర్టీసీ బస్సులన్నింటినీ నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.

Share This Post
0 0

Leave a Reply