కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.50 లక్షలు!

కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంను రూ. 50వేల నుంచి రూ. 2.50లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రకటించారు. పలు అంశాలపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. దళితులకు భూ పంపిణీ కోసం అవసరమైన భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధి ఎక్కువగా ఉండే 10 జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసం 100 ఎకరాల భూమిని గుర్తించి 3 ఎకరాల చొప్పున లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. పట్టణ పరిధి తక్కువగా ఉన్నటువంటి 20 జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసంగా 500 ఎకరాలు గుర్తించి ఇందులో 250 ఎకరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసు కోవాలన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో వ్యవసాయం చేసేందుకు గానూ విద్యుత్తు కనెక్షన్లు, నీటి సౌకర్యం అందించాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply