కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం..

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహాకూటమిలో భాగంగా తాను పోటీ చేయదలుచుకున్న సనత్‌నగర్ నియోజకవర్గాన్ని
కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. అయితే సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు మర్రి శశిధర్‌రెడ్డి విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఫలితం
లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది జరగలేదు. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైన కాసేపటికే సనత్‌నగర్
నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. చంద్రబాబు సూచన మేరకే మర్రి శశిధర్‌రెడ్డికి సీటు దక్కలేదని ఆయన అనుచరులు ఆగ్రహం
వెలిబుచ్చుతున్నారు.

TAGS:Marri Shashidhar Reddy , Congress Party , Telangana , Elections2018 ,

Share This Post
0 0

Leave a Reply