కలిసికట్టుగా కదలండి

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రానున్న పదిరోజులు మరింత కష్టపడి పనిచేయాలని, మున్సిపల్‌ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు.

టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచినవారితో నామినేషన్లను ఉపసంహరించుకొనేలా ప్రయత్నించాలని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నియోజకవర్గాలవారీగా ఆయా నేతలతో విడివిడిగా సమావేశమై.. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. నామినేషన్ల దాఖలు అనంతర రాజకీయ పరిస్థితులపై సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయిలో ప్రచారవ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.

Share This Post
0 0

Leave a Reply