కరోనా సంక్షోభం నేపథ్యంలో మరింత పెరిగిన మోదీ ప్రాభవం… న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుల్లో ఒకరిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలోనూ మోదీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని, ప్రజలు ఆయన నాయకత్వంపై విశేషంగా నమ్మకం ఉంచుతున్నారని అమెరికాలో ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఓ కథనం వెలువరించింది. అత్యధికులు మోదీ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే దాదాపు 90 శాతం మంది మోదీ నిర్ణయాలకే మద్దతు పలుకుతున్న విషయం తేలిందని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

Share This Post
0 0

Leave a Reply