కరోనా వేళ.. హైదరాబాద్‌లో 32 ప్రత్యేక బస్సులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ప్రత్యేకంగా నగరం నలుమూలలకు బస్సులను నడపనున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు. అయితే, ఈ బస్సుల్లోకి ఎక్కాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. అయితే, లోనికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని 32 రూట్లలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Share This Post
0 0

Leave a Reply