కరోనాతో ఆసుపత్రిపాలైన బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా

ఢిల్లీలో కరోనా మహమ్మారి ఎవరినీ కనికరించడంలేదు. బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురైన జ్యోతిరాదిత్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జ్యోదిరాదిత్య జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుండగా, ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. అటు, సీఎం కేజ్రీవాల్ సైతం అస్వస్థతకు గురికావడంతో కరోనా వైద్య పరీక్షలు తప్పలేదు.

Share This Post
0 0

Leave a Reply