కడప వేదికగా జేసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

కడప: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. శనివారం నాడు కడప జిల్లాలో పర్యటించిన ఆయన.. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైందని వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చనని జేసీ చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర ఉందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందని.. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగేనని జేసీ జోస్యం చెప్పారు. కాగా జేసీ.. టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.S

Share This Post
0 0

Leave a Reply