పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఔట్ కాకున్నా తనంతట తాను పెవిలియన్ చేరడంపై చర్చ జరుగుతూనే ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన బంతిని విరాట్ హుక్ చేయబోయాడు. ఐతే బంతి అతని బ్యాట్‌కు తాకకుండా నేరుగా వెళ్లి వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ చేతిలో పడింది. బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయిందని భావించిన విరాట్ అంపైర్ ఎరాస్మస్ ఔట్‌గా ప్రకటించకపోయినప్పటికీ మైదానాన్ని వీడాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లీ రీప్లే చూస్తూ అసహనానికి గురయ్యాడు. బ్యాట్‌ను కోహ్లీతో పాటు ధోనీ కూడా చెక్ చేయగా హ్యాండిల్ వదులుగా ఉందని తేలింది. షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు బ్యాట్ నుంచి శబ్దం రావడంతో బంతి బ్యాట్‌కు తగిలందని ఊహించి.. తాను మైదానాన్ని వీడానని గుర్తించిన విరాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(77, 65బంతుల్లో 7ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉంటే శతకం పూర్తి చేసేవాడని అభిమానులు నిరాశగా చెబుతున్నారు.
Tags: Virat Kohli ,CWC19 ,Worldcup2019