ఐటీ దాడుల కలకలం..! చంద్రబాబుకి అత్యంత సన్నిహితుల ఇళ్లలో సోదాలు..!

babu

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుల ఇళ్లపై ఏక కాలంలో దాడులు చేసిన ఐటీ అధికారులు.. సోదాలు నిర్వహిస్తున్నారు.. వీరిలో నరేష్ చౌదరి, లోకేష్ అత్యంత సన్నిహితుడు కిలారి రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ్ కుమారుడు పత్తిపాటి శరత్, కడప టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.. ఇక, చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌కు సంబంధించిన ఇళ్లలో విజయవాడ, హైదరాబాద్‌లోనూ ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఎన్నికల సమయంలో టీడీపీకి వీళ్ల దగ్గరి నుంచే డబ్బులు సరఫరా జరిగినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సోదాల సందర్భంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా… సీఆర్‌పీఎఫ్ పోలీసులను పెట్టి మరీ ఢిల్లీ యూనిట్ ఐటీ అధికారులు తమ పనికానిస్తున్నట్టు సమాచారం.

Share This Post
0 0

Leave a Reply