ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గండిమైసమ్మ మండలం బహదూర్‌పల్లికి చెందిన మైసిగారి శ్రీనివాస్‌, లక్ష్మి రెండేండ్ల క్రితం సర్వేనంబర్‌ 248లో 30 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. సదరు భూమిని మ్యుటేషన్‌ చేసుకోవడానికి శ్రీనివాస్‌ కొంతకాలంగా తాసిల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలో తాసిల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నరేందర్‌రెడ్డి.. రూ.40 వేలు లంచం ఇస్తే పని పూర్తిచేయిస్తానని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌ మ్యుటేషన్‌ చేయించే బాధ్యతను శ్రీనివాస్‌ తన బావమరిది శ్రావణ్‌కు అప్పగించాడు. నరేందర్‌రెడ్డి లంచం డిమాండ్‌ చేసినట్టు శ్రావణ్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం పక్కాప్రణాళిక ప్రకారం నరేందర్‌రెడ్డి.. శ్రావణ్‌ నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెడ్తామని.. ఈ కేసులో నరేందర్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు ఉన్నారేమోన్న విషయంపై ఆరాతీస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
రాజధాని మారుతుందని చెప్పి రైతులను భయపెడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనడం మంచిది కాదని అన్నారు. కక్ష సాధింపు చర్యలతో ముందుకెళ్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, జగన్ వైఖరిలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోందని విమర్శించారు.

Share This Post
0 0

Leave a Reply