ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..

appsc notification

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్తను అందించింది. ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రకటించారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1, 2, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక పోస్టులకు నెలాఖరున నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు ఆంగ్లంతో పాటు.. తెలుగు పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఉదయ భాస్కర్ వెల్లడించారు.

Share This Post
0 0

Leave a Reply