ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు కేంద్రప్రభుత్వం ఎప్పుడూ తోడు ఉంటుందని అన్నారు. ఏపీలో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు తెలిపిన మోదీ.. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఆయన సుపరిపాలన అందించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారత నిర్మాణం సా ధ్యమవుతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం ఏపీకి వచ్చిన ఆయనకు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ మంత్రులు, బీజేపీ, వైఎస్సార్సీపీ నేతలు స్వాగతం పలికారు.

అనంతరం రేణిగుంటలోని ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో ఏర్పాటుచేసిన బీజేపీ ప్రజా ధన్యవాద సభలో మోదీ మాట్లాడారు. నమో వేంకటేశ.. అంటూ స్తోత్రంతో తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బాలాజీ పాదపద్మాల సాక్షిగా నాకు మళ్లీ అధికారం అప్పగించిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు, స్వామికి నా ప్రణామాలు అంటూ తెలుగులో ప్రసంగించారు. తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా. దేవదేవుడి దర్శనానికివెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. శ్రీవారిని 130 కోట్ల భారతీయుల ఆశయాలను నెరవేర్చాలని కోరుతు న్నా అని తెలిపారు. మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. సేవచేసే అధ్యా యం ప్రారంభమైంది. ప్రజల భాగస్వామ్యం, వారి మద్దతుతో నవభారత నిర్మాణానికి కొత్త మార్గాలు వేస్తామనే నమ్మకం నాకున్నది అని మోదీ అన్నారు.

Share This Post
0 0

Leave a Reply