ఏపీలో మరో 154 మందికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,246 నమూనాలు పరీక్షించగా, 154 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,843కి పెరిగింది. తాజాగా 34 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 2,387 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,381 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇప్పటిదాకా 75 మంది మృతి చెందారు.

Share This Post
0 0

Leave a Reply