ఏపీని భయపెడుతున్న కరోనా కేసులు: ఒక్క రోజులో 68.. మరణాలు పెరిగాయి

ఏపీని కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,664 శాంపిల్స్‌ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,787కు చేరాయి. మరో 10 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 816కు చేరింది.

Share This Post
0 0

Leave a Reply