ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణం

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో శాసనసభ్యుడిగా ఎన్నికైన శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన చాంబర్‌లో సైదిరెడ్డితో శాసనసభ్యుడిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయనను స్పీకర్ పోచారం అభినందించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉపసభాపతి టీ పద్మారావు, మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, రంజిత్‌రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, తేరా చిన్నపరెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply