ఎన్టీఆర్ బతికుంటే వైసీపీకే మద్దతు తెలిపేవారు

ycp

ఎన్టీఆర్ కనుక ఒకవేళ బతికున్నట్టయితే తమ పార్టీకే మద్దతు తెలిపేవారంటూ వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు విసిరారు. ఎన్టీఆర్ బతికున్నంత కాలం టీడీపీ పద్ధతిగా ఉందని, ఇప్పుడు, ఎన్టీఆర్
సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పార్టీ మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే, టీడీపీ ఉద్దేశంలో అకౌంట్స్ ఫర్ ఓట్స్ గానే
చూస్తున్నారని, ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తి చేయలేదని, నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని ఏపీకి దాయం
లేకుండా సంక్షేమానికి బడ్జెట్ ఎలా కేటాయింపులు చేస్తారని బుగ్గన ప్రశ్నించారు.

TAGS : tdp , ntr , ycp ,budjet ,andhrapradesh ,

Share This Post
0 0

Leave a Reply