మృతి చెందిన పవర్ స్టార్ అభిమానులకు ఆర్థికసాయం ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్

0
42
Mythri Movie Makers announces funding to died Power Star fans
  • కుప్పం నియోజకవర్గంలో దుర్ఘటన
  • విద్యుత్ షాక్ తో పవన్ ఫ్యాన్స్ మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మైత్రీ మూవీ మేకర్స్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ అభిమానులు ముగ్గురు ప్రమాదవశాత్తు మృతి చెందడం తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగలడంతో వారు మృత్యువాత పడ్డారు.

దీనిపై టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. కుప్పం నియోజకవర్గంలో ముగ్గురు అభిమానులు మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకుని ప్రజాజీవితంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని పేర్కొంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఓ చిత్రం నిర్మిస్తోంది.
Tags: Mythri Movie Makers, Donation, Fans, Pawan Kalyan