ఉల్లి @ రూ.190

ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో ధరలు పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో హోల్‌సేల్‌గానే ఉల్లిగడ్డ కిలోకు రూ.150 ధర పలికింది. రిటైల్ మార్కెట్‌లో రూ.180- 190 అమ్ముతున్నారు. గతేడాది ఉల్లిగడ్డకు కనీస మద్దతు ధరలు లభించకపోవటంతో ఈసారి మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ర్టాల్లో రైతులు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించడం, సాగుచేసిన కొద్దిపాటి విస్తీర్ణంలో వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి

Share This Post
0 0

Leave a Reply