ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రభుత్వం పచ్చజెండా

babu

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్న భాష, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు చంద్రబాబునాయుడి ప్రభుత్వం పచ్చజెండా ఊపగా, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో 12 వేల మందికి పైగా ఉపాధ్యాయులు లాభపడనున్నారని, అందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలని మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసిన ఏపీ జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు. విద్యా హక్కు చట్టాల ప్రకారం, హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉన్నా, భాష, వ్యాయామ ఉపాధ్యాయులకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగానే వేతనాలు అందుతున్నాయని గుర్తు చేసిన ఏపీ జేఏసీ ప్రతినిధులు,
తమ విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. కొత్త జీవో వల్ల 10,827 మంది లబ్ది పొందనున్నారని తెలిపారు. ఆపై ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టైమ్ స్కేలు అమలు చేయాలని, దీనిని క్యాబినెట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతులన్నీ పరిశీలిస్తామని గంటా హామీ ఇచ్చారు.

 

TAGS: apcm chandrababu , andhraparadesh , teachersjobs ,greensignal ,

Share This Post
0 0

Leave a Reply