ఈ రోజు హైదరాబాద్ కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

venkaiah-naidu

ven

ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు కొంతపేపు వాహనాల రాకపోకలను నిలిపి దారి మళ్లించనున్నారు. వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఉపరాష్ట్రపతి బేగంపేట్ ఎయిర్‌పోర్టునుంచి తార్నాక ఎన్‌ఐఎన్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.కార్యక్రమం ముగిసిన తర్వాత తార్నాక నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి చేరుకుంటారు. 15న సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.25 నిమిషాలకు జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత 6.15 నిమిషాలకు బంజారాహిల్స్ తాజ్ దక్కన్ హోటల్‌కు వెళ్తారు. అక్కడి నుంచి 6.45 నిమిషాలకు జూబ్లీహిల్స్‌లోని ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో అంక్షలు ఉంటాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు.

TAGS : Venkaiahnaiudu , telangana , hyderabad , trafic ,

 

Share This Post
0 0

Leave a Reply