ఆ హీరోను మాత్రం వదిలిపెట్టను

 

దక్షిణాదిన ఓ ప్రముఖ హీరో అల్లుడు, యువ హీరో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నటి అమైరా దస్తర్, తాజాగా ఓ పత్రికకను ఇచ్చిన
ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో సాంగ్ చేస్తుండగా,
అనవసరంగా తనపై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని, ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళితే, తనకు నరకం చూపించారని ఆరోపించింది. అమైరా దస్తర్,
గతంలో ధనుష్ తో కలసి ‘అనేగన్’ అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించింది. ఆమె, చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని
సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందని పలువురు అంటున్నారు. హీరో ధనుష్, రజనీకాంత్
అల్లుడన్న సంగతి తెలిసిందే. ఇక తనను వేధించింది ఎవరన్న విషయాన్ని అమైరా స్వయంగా చెబితే తప్ప నిజం బయటకు రాదు.

 

Tags: MeeToo bolly,amyra daster,  carvan,south indian movies

Share This Post
0 0

Leave a Reply