ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి లేదంటే..25తర్వాత ఎప్పుడైనా సమ్మె..

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కారించాలంటూ టీఎ్‌సఆర్టీసీ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) యూనియన్‌ నాయకులు టీఎ్‌సఆర్టీసీ యాజమన్యానికి శుక్రవారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. టీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెనోటీస్‌ ఇచ్చిన అనంతరం టీఎస్‌ ఆర్టీసీ కార్మికసంఘ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటాచారి, పి.రమే్‌షకుమార్‌ మాట్లాడారు. 2017 వేతన సవరణ ఇప్పటి వరకు అమలుచేయకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ రవాణాను అరికడితే ఆర్టీసీకి రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు గత సంవత్సరం నుంచి సెటిల్‌మెంట్‌ అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్టీసీకి ఉన్న రుణాల వడ్డీలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, సీసీఎస్‌. పీఎఫ్‌, ఎస్‌ఆర్‌బీఎ్‌సల కార్మికుల పొదుపు సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలని ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్‌పై అమ్మకపు పన్ను తగ్గించి, ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్‌ 25 తర్వాత ఏ క్షణమైన సమ్మెలోకి వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఆర్‌.వెంకట్‌రెడ్డి, జి.నర్సింగరావు, పి.శ్రీమతి, శివనాథ్‌, ఎం.చంద్రమోహన్‌, నాగరాజ్‌, పిట్టా శ్రీనివా్‌సరెడ్డి, రామరాజులు పాల్గొన్నారు.
25తర్వాత ఎప్పుడైనా సమ్మె..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఈనెల 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీఎంయూ రంగారెడ్డి రీజినల్‌ కార్యదర్శి ఎల్‌బీరెడ్డి పిలుపునిచ్చారు.

Share This Post
0 0

Leave a Reply