ఆరు అడుగులు పెరిగిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం!

శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తుండటం, మరోవైపు జూరాల నిండుకుండగా మారడంతో రిజర్వాయర్ నుంచి శ్రీశైలానికి 1,76,824 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిల్వ 215.80 టీఎంసీలు. పూర్తి స్థాయిలో నీరు నిండితే 885 అడుగుల మేరకు నీరు ఉంటుంది. నిన్న ఉదయం జలాశయంలో 804 అడుగుల వరకూ నీరుండగా, వరద నీటి రాక ప్రారంభం కావడంతో, ఈ ఉదయం 810 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఈ వరద మరింతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Share This Post
0 0

Leave a Reply