ఆఫీసులోనే మహిళా తహశీల్దారు విజయను సజీవదహనం చేసిన దుండగుడు

హైదరాబాదులో దారుణం సంభవించింది. తహశీల్దారుగా పని చేస్తున్న విజయను ఓ దుండగుడు తగలబెట్టాడు. నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు కార్యాలయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పటించి సజీవదహనం చేశాడు. ఈ సందర్భంగా తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మధ్యాహ్నం 1.20 గంటలకు తహశీల్దారు కార్యాలయంలోకి హంతకుడు చొరబడ్డాడు. అరగంట సేపు విజయ గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను సజీవదహనం చేశాడు. కాసేపటి క్రితం ఘటనా స్థలికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు.

Share This Post
0 1

Leave a Reply