ఆపదలో అస్త్రం హాక్‌ఐ

ఇంటర్నెట్ లేకపోయినా హాక్‌ఐ ద్వారా అత్యవసరసేవలు అందుకునేలా ఇటీవల కొత్త ఫీచర్‌ను తెలంగాణ పోలీసులు జతచేశారు. ఆపత్కర సమయాల్లో పోలీసులకు సులువుగా సమాచారం ఇచ్చే ఎస్వోఎస్ (సేవ్ అవర్ సోల్)ను కీలక ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ హాక్‌ఐ మొబైల్ యాప్ ప్రధానంగా పది ఫీచర్స్ ఉన్నాయి.
రిపోర్ట్ ఏ వయోలేషన్: ఎవరైనా ట్రాఫిక్, ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆ సమాచారాన్ని వీడియో లేదా ఫొటో లేదా ప్రదేశం రూపం లో ఈ యాప్‌లోని రిపోర్ట్ ఏ వయోలేషన్ ఆప్షన్‌లో నమోదుచేస్తే ఆ సమాచారం పోలీసులకు చేరుతుంది.
ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్: మహిళల ఒంటరి ప్రయాణ సమయాల్లో వాహనం నంబర్, ఎక్కడి నుంచి వెళ్తున్నారనే వివరాలను ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ ఆప్షన్‌లో నమోదుచేస్తే క్షేమంగా గమ్యం చేరేవరకు ఆయాపరిధిలోని పోలీసులు అలర్ట్‌గా ఉంటారు.
వెహికిల్‌సెర్చ్ : సెకండ్‌హ్యాండ్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ వాహనం నంబర్‌ను వెహికిల్‌సెర్చ్ ఆప్షన్‌లో పొందుపరిస్తే.. దాని పై ఉన్న కేసుల వివరాలు లభిస్తాయి.

Share This Post
0 0

Leave a Reply