ఆపదలు తొలగించే దత్తాత్రేయస్వామి స్తోత్రం

శ్రీదత్తాత్రేయస్వామి ఎంతోమంది దేవతలకు .. మహర్షులకు జ్ఞానాన్ని భోదించారు. లోకంలోని జీవరాసుల నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలో సెలవిచ్చారు. వివిధ రూపాల్లో తిరుగాడుతూ .. తనని పూజించేవారి భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ వాళ్ల పట్ల తన అనుగ్రహ వర్షం కురిపిస్తుంటారు. దత్తాత్రేయస్వామి నామ స్మరణం వల్లనే సమస్త పాపాలు హరించివేయబడతాయి. ఆ స్వామి దర్శనమాత్రం చేతనే అన్నిరకాల దోషాలు తొలగిపోతాయి.

ఆ స్వామి లీలా విశేషాలను గురించి తెలుసుకుంటే దత్తాత్రేయస్వామివారి స్తోత్రం ఎంతటి శక్తిమంతమైనదనే విషయం అర్థమవుతుంది. శ్రీదత్తాత్రేయస్వామివారి స్తోత్రం ‘జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్! సర్వరోగహరం దేవం .. దత్తాత్రేయమహం భజే!! అంటూ సాగుతుంది. ఈ స్తోత్రాన్ని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉండటం వలన, ఆయురారోగ్యాలు కలుగుతాయనీ .. ఆపదలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఈ స్తోత్రాన్ని పఠించడం వలన అవి తప్పకుండా తొలగిపోతాయనేది అనుభవాల్లో నుంచి వచ్చిన మాట.

Share This Post
0 0

Leave a Reply